ఒకానొక మరపురాని కాలం........✍️✍️🌷🌹
🌹🌹నటన ఏ స్థాయిలో ఉంటుందో... అభిమానం ఎంతవరకు వెళ్తుందో నిరూపించిన సందర్భాలు అవి. దానికి పరాకాష్టగా నిలిచారు అద్భుత నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు.
రామారావుని కృష్ణుడిగా చూడ్డానికి ఊళ్ల నుంచి రెండెడ్ల బండ్లు కట్టుకుని వచ్చేవారని చెప్పుకునేవారు నా చిన్నప్పుడు. ఆయన తెరమీద కనబడితే చాలు కర్పూర నీరాజనాలు పట్టేవారని అనుకునే వారు.
నిజంగా కృష్ణుడు, రాముడు పొరపాటున ప్రత్యక్షమైనా... మా ఎన్టీవోడిలా లేరు... పక్కకి జరుగెహె... అని విసుక్కునేంత అభిమానం.
పౌరాణిక పాత్రలకి రామారావుగారే బెంచ్‌మార్కు. అందుకే ఆయనకే ఫస్టు మార్కు.🌹🌹
🌹🌹జనం అభిమానించడం మొదలెడితే దాచుకోరు, దాచుకోలేరు. గుండెల్లో సింహాసనం వేసి కూర్చోబెట్టేస్తారు. గుడి కట్టేస్తారు.🌹🌹
🌹🌹తమిళ హీరో ఎమ్జీయార్ చనిపోయినప్పుడు ఆయన లేడన్న చేదు నిజం జీర్ణం కాలేదంట ఆయన భక్తులకి. తమ అభిమాన నటుడ్ని చివరిసారి చూడ్డానికి తమిళనాడులో ఎక్కడెక్కణ్ణించో వచ్చిన జనాలు గుండెలు బాదుకుంటా కన్నీరు మున్నీరయ్యారు. ఇసకేస్తే రాలనంత జనాలు ఎమ్జీయార్ అంతిమయాత్రలో వేదన ఎలా ఉంటుందో ప్రపంచానికి చెప్పేరు. కన్నీళ్లతో నానిపోయిన కడపటి చూపుల్ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు.🌹🌹
🌹🌹పురచ్చితలైవి జయలలిత ఆసుపత్రిలో ఉండగానే వందలాది అభిమానులు తిండీతిప్ప ల్లేకుండా రాత్రీపగలు అక్కడే కలతిరిగారు. ఆవేదనతో ఆందోళనతో అమ్మ గురించి భయపడక్కర్లేదన్న శుభవార్త వినిపిస్తారేమోననే ఆశతో. అమ్మ ఇక లేదని తెల్సిన క్షణాల్ని మాటల్లో చెప్పలేం. ఆమె శాశ్వతంగా దూరమైనప్పుడు, మా అమ్మ చనిపోవడమేంటి... మెరీనా బీచ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు... అమ్మ పోయిందని ఇంకోసారి అంటే ఊరుకునేది లేదు... అని వాదించారు. అమ్మ మనల్నీ, ఊపిర్నీ వదిలేసిందని నమ్మిన చాలామంది బాదని తట్టుకోలేక గుండెలు పగిలి చనిపోయారు.🌹🌹
✍️✍️✍️ తన్నీరు రమేష్ 🌷🌹